NTV Telugu Site icon

TG BJP Meeting: టీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముహుర్తం ఫిక్స్..

Telangana Bjp

Telangana Bjp

TG BJP Meeting: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 8 సీట్లు గెలుచుకుని బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల తర్వాత మరోసారి కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావడంతో రాష్ట్రానికి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Read also: Vangaveeti Radha Krishna: వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు.. వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు

ఈ సమావేశానికి బీజేపీ కీలక నేత బీఎస్ సంతోష్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధతపై చర్చిస్తామన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసనలపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమాల కార్యాచరణకు సిద్దమైంది.
Gold Price Today: భారీ షాక్.. తులం బంగారంపై రూ.710 పెరిగింది!

Show comments