BJP MP Laxman: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలవి కానీ హామీలు అమలు చేయలేక డ్రామాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఎజెండా సృష్టించి ఫేక్ ప్రచారాలు చేస్తు ప్రజల తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలు కడిగితే పోవని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. కొత్త వేషం వేసుకొని కమ్యూనిస్టు అవతారం ఎత్తారన్నారు. పాకిస్తాన్, చైనా భూ ఆక్రమణ ఇప్పుడు జరగలేదన్నారు. ప్రధాని కోసం మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టింది నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలు దురదృష్ట కరం అన్నారు.
Read also: CM Revath Reddy: ఏడు పాయల అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
రాజకీయ రంగు పులిమి రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. ఎటువంటి చర్చకైన బీజేపీ సిద్దమని తెలిపారు. తప్పుడు ప్రచారానికి కేంద్రంగా తెలంగాణ మారిందన్నారు. అమిత్ షా వీడియో ను మార్ఫింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. అమిత్ షా రాజ్యసభలో కాంగ్రెస్ చేసిన చర్యలను ఎండగట్టడంను ఆ పార్టీ జీర్ణించుకోలేక రాద్ధాంతం చేస్తుందన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతుందని వ్యంగాస్త్రం వేశారు. అంబేద్కర్ ను అడుగడుగున అవమానించింది కాంగ్రెస్ అన్నారు. నెహ్రూ బ్రతికి ఉండగానే భారత రత్న తీసుకున్నారు.. కానీ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వలేదన్నారు.
అంబేద్కర్, రాజ్యాంగం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమన్నారు. ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించారు ప్రజలకు తెలుసని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాహుల్ గాంధీ అభాసు పాలు అవుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.. అల్లు అర్జున్ ఉదంతం ఉదాహరణ అన్నారు. ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి పై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని తెలిపారు. పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Rains: తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. రెండు రోజులు వానలు