Site icon NTV Telugu

Kishan Reddy: బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్.. ప్రారంభించనున్న కిషన్ రెడ్డి

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: నేటి (బుధవారం) నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిగా భాజపా జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీలు లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జిమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ డివిజన్‌లో ఉదయం 9.30 గంటలకు మరో జిమ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోనే ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర స్థాయి బీజేపీ సమావేశంలో పాల్గొననున్నారు.

Read also: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జీలుగా కిషన్‌రెడ్డి, రాంమాధవ్‌.. ఉత్తర్వులు జారీ..

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు సెప్టెంబర్ 18న, రెండో విడత ఎన్నికలు 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనున్నాయి.అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Exit mobile version