NTV Telugu Site icon

Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలి..

Mp Dr. Laxman

Mp Dr. Laxman

Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాకలి బండా నే స్ఫూర్తి గా చేసుకొని నిజాం కి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాడిందని తెలిపారు. నిజాం తొత్తులను గ్రామాల నుండి పారద్రోలిందన్నారు. బీజేపీ ఉద్యమం వల్లనే నిజాం వ్యతిరేకంగా పోరాడిన యోధుల ను అన్ని పార్టీ లు, వర్గాలు స్మరించుకుంటున్నాయి. వారికి గౌరవం తగ్గిందన్నారు. మహిళ విశ్వవిద్యాలయానికి రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం స్వాగతిస్తున్నానని తెలిపారు. ఎందుకు విమోచన దినం జరపరని రేవంత్ రెడ్డి నీ ప్రశ్నిస్తున్నామన్నారు. రజాకార్లు వారసుల పార్టీ మజ్లిస్ కు ప్రభుత్వాలు తలొగ్గాయన్నారు. చాకలి ఐలమ్మ పై గౌరవం ఉంటే 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీ లకి రిజర్వేషన్ లు కల్పించాలన్నారు. రేవంత్ రెడ్డి కి మనసు రావడం లేదన్నారు.
కుల గణనతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. చాకలి కులాన్ని ఎస్సీ లలో చేర్చాలనే డిమాండ్ ఉందని తెలిపారు. కుల గణన పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ లు ఎత్తి వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు… దీని పై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
Zee Telugu : ‘సరిగమప సీజన్ 16’ ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్.. స్టార్ట్ ఎప్పుడంటే..?