NTV Telugu Site icon

Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంతాపం అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ దేశంలో ఉన్న అసమానతల్ని రూపుమాపేందుకు మన్మోహన్‌ ప్రయత్నించారు. మన్మోహన్‌ సింగ్‌ అరుదైన, అసామాన్య వ్యక్తి అన్నారు. సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన ఘటన మన్మోహన్‌ సింగ్‌ ది అని భట్టి విక్రమార్క అన్నారు.

Read also: CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న, తెలంగాణలో విగ్రహం.. అసెంబ్లీలో సీఎం..

ఎందరో పుడతారో మాయం అవుతారు.. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు.. అందులో దివంగత నేత మన్మోహన్ సింగ్ ఒకరు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారన్నారు. మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారు. ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దే అన్నారు.

Read also: Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారు. దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన తీసుకువచ్చారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఏర్పడగా… ఈ చట్టం ద్వారా దేశ ప్రజలు ఆర్థిక మాధ్యం బారిన పడకుండా కాపాడగలిగారని తెలిపారు. ఆత్మగౌరవం లేకుండా అడవుల్లో పలికే వారి కోసం అటవీ హక్కు చట్టాన్ని తీసుకువచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భూ సేకరణ చట్టం తీసుకువచ్చి దేశంలో ప్రగతిశీల వాదుల మన్ననలు పొందారు. అమానవీయమైన స్కావెంజర్స్ చట్టాన్ని పూర్తిగా రద్దుచేసి.. వారికి భద్రత కల్పిస్తూ ప్రపంచంలో భారతదేశంపై గౌరవం పెంచారన్నారు.
TG Assembly: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి..

Show comments