Site icon NTV Telugu

Big Breaking: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు..

Hyderabad Tank Nand

Hyderabad Tank Nand

Big Breaking: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆంక్షలపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పైనుంచి నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, ట్యాంక్ బండ్ పై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. అనంతరంలో హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కొత్త రూల్స్ తెచ్చి ప్రభుత్వం భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాలు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 2022, 2023లో ఇలాగే చెప్పారని, చివరకు ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోకుంటే సోమవారం హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Ganesh Immersion: అటు బాలాపూర్‌.. ఇటు ఖైరతాబాద్‌.. రూట్‌మ్యాప్‌ విడుదల చేసిన సీపీ ఆనంద్‌..

Exit mobile version