NTV Telugu Site icon

BRS MLA Into Congress: కాంగ్రెస్‌ లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రేపు మరో నలుగురు..!

Bandla Krishna Mohan Reddy

Bandla Krishna Mohan Reddy

BRS MLA Into Congress: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వరుస వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రేపు చేరాల్సి ఉండే.. జిల్లా రాజకీయ పరిస్థితులు దృష్ట్యా ఇవాళ చేరడం గమనార్హం. కాంగ్రెస్ లో రేపు మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు చేరే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా ఇవాళ ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు శ్రీధర్ బాబును బీఆర్ఎస్ నేతలు కలవనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకుంది. ఈ కార్యక్రమంలో.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ పాల్గొన్నారు.

Read also: Balkampet Yellamma: బల్కంపేట రోడ్డు మూసివేత.. మళ్లింపు ఇలా..

బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపో మాపో కాంగ్రెస్ కండువా కూడా కప్పుకుంటారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరడంపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన కాంగ్రెస్‌లో చేరిన నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Hyderabad Rains: హైదరాబాద్‌ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు..