Site icon NTV Telugu

Bandi Sanjay: భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భాగ్యనగర గల్లీ గల్లీలో బోనాల జాతర కొనసాగుతుందన్నారు. అమ్మవారు మన కష్టాలు తీర్చి సుఖసంతోషాలు చేకూరుతాయని హిందువుల నమ్మకం అన్నారు. తల్లికి బోనం సమర్పిస్తే కష్టాలు తొలగుతాయి, సమస్యలు పోతాయన్నారు. అంటువ్యాధుల నుంచి బయటపడతామని సైనికులు సికింద్రాబాద్ లో బోనాలు సమర్పించిన చరిత్ర ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారు. మా పండుగలను పాతబస్తీ లో జరుపుకునే పరిస్తితి లేదని కొంతమంది భక్తులు ఆవేదన చెందుతున్నారు. రాబోయే ది బిజెపి ప్రభుత్వమే. పాతబస్తీలో కూడా గల్లీ గల్లీలో మన పండుగ జరుగుతుంది.

Read also: Kishan Reddy: హైదరాబాద్ లో పండుగ వాతావరణం.. భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ..

ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హిందువుల పండుగల ను కాపాడుటలేదన్నారు. హైదరాబాద్ బోనాల పండుగ కు 5 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. 33 కోట్లు రంజాన్ పండుగకు ఇచ్చారని తెలిపారు. హిందువులు ఎం పాపం చేశారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు. గత పాలకులు ఇదే తరహాలో చేస్తే ఏమైందో చూసామన్నారు. హిందువుల తరపున పక్కా మాట్లాడుతా. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. ఎంఐఎం గోడ మీద పిల్లులు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికారంలోకి వస్తె వారి పక్కన చేరతారని అన్నారు. అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తా అనడంటే సీఎం , అక్బరుద్దీన్ అన్నదమ్ములు అయ్యారన్నారు. దమ్ముంటే కొడంగల్ అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు.

Soori : చిన్న చిత్రంగా విడుదలై 50 డేస్ కంప్లీట్ చేసుకున్న చిత్రం

Exit mobile version