NTV Telugu Site icon

Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నాకు రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని ఇట్ల మీడియా ముందు మాట్లాడతమా? అని ప్రశ్నించారు. నేనే కాదు… ఎవరితోనైనా దోస్తానా? ఉంటే ఫోన్ లో మాట్లాడుకుంటరే తప్ప మీడియాతో మాట్లాడరు కదా అని అన్నారు. అంతెందుకు మీ అయ్యకు కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకే చీకట్లో ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వచ్చింది వాస్తవం కాదా? అన్నారు.
ఆ కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా?’’ అంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ను కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు తీవ్రస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నరు కదా.. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నది కదా? ఎందుకు తేల్చలేకపోయారు? ఎందుకు ఆ కేసును నీరుగార్చారు? రేవంత్ తో దోస్తానా ఉన్నది మీకా? మాకా? అన్నారు.

Read also: Tummala Nageswara Rao: వారికి రైతు భరోసా ఇవ్వలేము.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ అహంకారంవల్లే బీఆర్ఎస్ పార్టీకి ఇయాళ ఈ గతి పట్టిందన్నారు. అయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్తితి కూడా లేదన్నారు. ఆయన బాధ భరించలేకే వాళ్ల అయ్య కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పండుకున్నడు. కేటీఆర్ వల్ల ఆ పార్టీ పూర్తిగా సర్వనాశనమవడం ఖాయమన్నారు. కేటీఆర్… ఏదో ఒక పేపర్ చూసి మొరుగుడు కాదు… నిరుద్యోగులను లాఠీఛార్జ్ చేయించింది మీ అయ్యే కదా? అని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను లాఠీలతో కొట్టించింది మీరు కాదా? దానికి ముందు సమాధానం చెప్పు? అయ్యప్ప సొసైటీ విషయంలో పైసలు దండుకుంది మీరు కాదా? మా గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదన్నారు. మూసీలో స్టే చేయడానికి మాకేం పనిలేదా?… కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పేరుంది. ఆయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని వాంగ్మూలం ఇచ్చారు కదా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్లకు దమ్ముంటే సీబీఐకి కేసు అప్పగించండి… మీ ఇద్దరి మధ్య లాలూచీ లేకుండా సీబీఐకి కేసు అప్పగించాలి. కేసీఆర్… ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో లాలూచీ పడలేదంటే.. మూటలు అప్పగించలేదనుకుంటే దమ్ముంటే సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలని సవాల్ విసిరారు.
MLC Kavitha: నేడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..