NTV Telugu Site icon

Arikepuri Gandhi Arrest : అరికెపూడి గాంధీ అరెస్ట్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Gandhi Arest

Gandhi Arest

Arikepuri Gandhi Arrest : కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాంధీతోపాటు నలుగురు కార్పొరేటర్లను అదుపులో తీసుకున్నారు పోలీసులు. కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. గాంధీని తీసుకువెళుతున్న పోలీసులను గాంధీ అనుచరులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నా ఇంటికి వస్తా అని రాలేదు కాబట్టే.. నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చా అన్నారు. దమ్ముంది కాబట్టే కౌశిక్ ఇంటికి వచ్చా అన్నారు. నీ ఇంటికి వచ్చా చూసుకుందా రా కౌశిక్ రెడ్డి అన్నారు గాంధీ. ఉద్రిక్తల మధ్య గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు గాంధీని, ఇరువర్గాల కార్యకర్తల్ని అదుపులో తీసుకున్నారు.

Read also: Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. ఇంటి ముందు కూర్చున్న గాంధీ..

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయన పై కోడుగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారు తమ ప్రతాపం చూపించారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎక్కడ చూసినా పగిలిన కోడిగుడ్లు, టమాటాలు దర్శనమిచ్చాయి. అయితే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద గాంధీ ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలని.. నేను ఇక్కడే ఉంటా అంటూ గాంధీ సవాల్ చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులో తీసుకున్నారు.

Kamareddy: బిల్లులు చెల్లించండి.. ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్..

Show comments