AP CM Chandrababu: హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీ.. పోలీసులు ఏమన్నారంటే..
- హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీ..
- వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి..
- నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని పోలీనులు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఒకే వేదికపైకి రాబోతోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. చర్చలకు రావాలని ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదన పై ఇటీవల ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీని (శనివారం) సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇందులో పాల్గొనేందుకు మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఆ హోదాలో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాగత ర్యాలీ నిర్వహించనున్నారు.
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగనుంది.దీనికి హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ర్యాలీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి పీ అండ్ టీ జంక్షన్- బేగంపేట ఫ్లైఓవర్- ప్రజాభవన్- పంజాగుట్ట ఫ్లైఓవర్- ముఖరంజా మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకుంటుంది. కొద్ది నిమిషాల పాటు చంద్రబాబు అక్కడ ఆగనున్నారు. తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్వాగత ర్యాలీ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65కి చేరుకుంటుంది.ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అజ్మీరారాజు నాయక్ దాఖలు చేసిన దరఖాస్తుకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ర్యాలీలో డ్రోన్లు, ఫ్లయింగ్ కెమెరాలు ఉపయోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..