లేడీ డైరెక్టర్ సుధ కొంగర, సౌత్‌లో డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకునే సూర్య కాంబినేషన్ మరోసారి రీపీట్ అవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ” ఆకాశం నీ హద్దురా ” సినిమాతో సూపర్ హిట్‌తో పాటు ఎన్నో అవార్డులు సాధించారు. సుధ కొంగర మరోసారి సూర్యను డైరెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కథ చర్చలు ఈ మధ్యనే ముగిసినట్టు సమాచారం. ఇదే జరిగితే వారి ఖాతాలో మరో భారీ హిట్టు పడటం ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు .
గతంలో సుధ కొంగర ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి. ఆర్ గోపినాథ్ జీవిత చరిత్రను తమిళంలో సూరరై పొట్రుగా తెరక్కించారు. ఈ చిత్రం తెలుగులో “ఆకాశం నీ హద్దురా ”గా డబ్ చేసి రీలీజ్ చేశారు. ఈ చిత్రం విడుదలయి భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. దీంతో పాటు గురు సినిమాను తెలుగులో తెరక్కించారు. ఇప్పటికే సూర్య నటిస్తున్న “జై భీమ్” మూవీ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.