Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముగిసింది. కౌశిక్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు. కౌశిక్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తామని తెలిపారు. ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదని మండిపడ్డారు. మహిళల ప్రతాపం అతనికి పూర్తిస్థాయిలో తెలియదని అన్నారు. మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్ కి పిలిచాడు.. అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చానని తెలిపారు. హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ, కౌశిక్ రెడ్డి వెళ్ళాడని తెలిపారు. ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదని మండిపడ్డారు.
Arvind Kejriwal’s Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. సీబీఐ కేసులోనూ బెయిల్
BRS Meeting: కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం
- ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముగిసింది..
- కౌశిక్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు..
Show comments