రేపు జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధం అవుతున్నారు.. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26 వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో ఈరోజు సాయంత్రం నుంచే మందుబాబులు వైన్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు..
హైదరాబాద్ సిటీలో వైన్ షాపుల దగ్గర రద్దీ నెలకొంది. పబ్లిక్ హాలిడే.. దీనికితోడు లాంగ్ వీకెండ్ వచ్చింది.. దీంతో మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో వైన్ షాపుల ముందు బారులు తీరారు.. తమకు కావలసిన బ్రాండ్ లను కొనుగోలు చెయ్యడంలో బిజీగా ఉన్నారు.. ఇప్పటికే సగానికి పైగా జనాలు మద్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. జనవరి 26వ తేదీ నేషనల్ డ్రై డే.. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడా వైన్ షాపులు ఉండవు.. బార్లు తెరవరు.. పబ్స్ ఓపెన్ చేయరు. హోటల్స్ మందు పోయరు.. అందుకే ఈరోజే కొనుగోలు చేసుకొని స్టోర్ చేస్తున్నారు..
రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా జనవరి 26 నేషనల్ డ్రై డే గా పరిగణిస్తారు. తెలంగాణలో అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది.. మళ్లీ తిరిగి శనివారం వైన్ షాపులు తిరిగి ఓపెన్ కానున్నాయి.. ఎవరైనా పొరపాటును ఆదేశాలను పక్కన పెడితే అంతే.. నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని… అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది..
