Hyderabd Weather Update : హైదరాబాద్‌లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
- పగలే చీకట్లు.. నగరాన్ని కమ్మేసిన దట్టమైన మేఘాలు
- ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలకు ఐఎండీ హెచ్చరిక
- గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
- జీహెచ్ఎంసీ అలర్ట్.. అవసరం లేకుంటే బయటకు రావొద్దని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabd Weather Update : మహానగరం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం మధ్యాహ్నం తర్వాత నగరం అంతటా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేయడంతో పగలే చీకటిలా అనిపించింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే చల్లటి గాలులతో కూడిన వర్షపు చినుకులు మొదలయ్యాయి.
ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) ‘ఎల్లో అలెర్ట్’ జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆకాశంలో బలమైన మేఘాలు ఆవరించి ఉండటం వల్ల కొన్ని చోట్ల గంట నుంచి రెండు గంటల పాటు కుండపోత వాన పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
Also Read
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వర్షంతో పాటు నగరంపై బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ గాలుల వల్ల రోడ్లపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైకర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. బలమైన గాలుల కారణంగా పాత బస్తీలు, నిర్మాణంలో ఉన్న బిల్డింగుల వద్ద చెట్లు లేదా ఫ్లెక్సీలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నగరవాసులకు అధికారుల అలర్ట్
అకస్మాత్తుగా మారిన వాతావరణం వల్ల ఐటీ కారిడార్ తో పాటు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాన పడే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, చెట్ల కింద గానీ, కరెంట్ స్తంభాల పక్కన గానీ నిలబడవద్దని మున్సిపల్ (GHMC), ట్రాఫిక్ అధికారులు నగరవాసులను కోరుతున్నారు. వరద నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ ‘ఆలూ సమోసా’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!