Water Scam: హైదరాబాద్ వాసులారా మీరు తాగుతున్న నీరు సేఫ్‌నా.? నకిలీ జలమండలి ట్యాంకర్లు..!

  • జలమండలి లోగో దుర్వినియోగం.. అక్రమ ట్యాంకర్ల దందా
  • నాణ్యత లేని నీరు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు
  • అధికారిక మార్గాల్లోనే ట్యాంకర్ బుకింగ్ చేయండి
  • తనిఖీలు ముమ్మరం.. అక్రమ ట్యాంకర్ స్వాధీనం
Hiccups

Hiccups

హైదరాబాద్ నగరంలో జలమండలి అధికారిక లోగోను అడ్డం పెట్టుకుని అక్రమంగా నీటిని సరఫరా చేస్తున్న ప్రైవేట్ ట్యాంకర్ల పట్ల అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా బోర్డు లోగోను వినియోగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే మోసపూరిత చర్య అని జలమండలి స్పష్టం చేసింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

Telangana: ఇంధన నిల్వలు తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్..

ప్రైవేట్ బోర్‌వెల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయబడినవి కావని అధికారులు వెల్లడించారు. ఈ నీటిపై ఎలాంటి నాణ్యత పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా జలమండలి పేరును వాడుకుంటూ కొందరు కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులు మండిపడ్డారు.

నీటి అవసరాల కోసం ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడవద్దని జలమండలి సూచించింది. సురక్షితమైన , శుద్ధి చేసిన నీటిని పొందేందుకు కేవలం అధికారిక మార్గాలనే ఉపయోగించాలని కోరింది. ట్యాంకర్ బుకింగ్ కోసం జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేయడం ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్/యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు నగరాంతటా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో జలమండలి లోగోను అక్రమంగా వాడుతున్న ఒక ప్రైవేట్ ట్యాంకర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎక్కడైనా జలమండలి లోగో దుర్వినియోగం అవుతున్నట్లు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జలమండలి సేవలపై ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడేందుకు భవిష్యత్తులో కూడా ఇటువంటి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.