హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు..వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది.. అయితే ఈ ఘటనలో కారులోనివారు సురక్షితంగా బయటపడ్డా లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ప్రమాదం జరిగే సమయంలో లారీ డ్రైవర్ కు గుండె పోటు వచ్చిందని సమాచారం.. దాంతో లారీని అదుపుచెయ్యలేక ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది..
వివరాల్లోకి వెళితే..కర్నూల్ నుండి హైదరాబాద్ కు ధాన్యం లోడ్ తో లారీ బయలుదేరింది.. మరి కొద్దిసేపటిలో గమ్యానికి చేరుతుందనగా లారీ ప్రమాదానికి గురయ్యింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వయూనివర్సిటీ సమీపంలో వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పింది.. రోడ్డుపక్కకు దూసుకుళ్లిన లారీ ఆగివున్న ఓ కారును ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు..
భారీ లారీ ఢీకొట్టినప్పటికి కారులోని వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ కు గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది..ఈ ఘటనలో లారీతో పాటు కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయి..ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ధాన్యం లోడ్ లారీతో పాటు కారును రోడ్డుపైనుండి పక్కకు జరిపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు..