Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ పిండివంటలు, రకరకాల మిఠాయిల ఘుమఘుమలతో కళకళలాడాలి. కానీ భాగ్యనగరంలో పేరుమోసిన స్వీట్ షాపుల కిచెన్లలోకి తొంగిచూస్తే మాత్రం వాంతులు వచ్చేంత దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. ప్రజల పండుగ ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటూ, నిలువునా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మిఠాయి దుకాణాలపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం (TG-SAFE) అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.
తీపి ముసుగులో కల్తీ దందా: కిచెన్లలో కళ్లుతిరిగే నిజాలు ఎంతో ఆర్భాటంగా, తళతళలాడే గాజు షోకేసుల్లో అమర్చే మిఠాయిల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు చెందిన 12 ప్రత్యేక బృందాలు గ్రేటర్ పరిధిలోని 17 ప్రముఖ స్వీట్ షాపులను జల్లెడ పట్టాయి. తయారీ కేంద్రాల్లోకి అడుగుపెట్టిన అధికారులకే దిమ్మతిరిగే పరిస్థితులు కనిపించాయి:
Also Read
- ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
కుళ్ళిన ముడిసరుకు: బూజు పట్టిన పదార్థాలు, పురుగులు పట్టిన వేరుశెనగ పల్లీలు, నిల్వ ఉంచిన రసాయన నూనెలు నేరుగా మిఠాయిల తయారీలో వాడుతున్నారు.
ఎక్స్పైరీ స్వీట్లతో కొత్త స్వీట్లు: గడువు ముగిసిన, అమ్ముడుపోని పాత స్వీట్లను పారేయకుండా.. వాటినే మళ్లీ వేడి చేసి, రంగులు, పంచదార పాకం జోడించి కొత్త స్వీట్లుగా మార్చి కస్టమర్ల నెత్తిన రుద్దుతున్నారు.
నరకప్రాయమైన వాతావరణం: ఈగలు ముసిరిన గదులు, మురికి నీరు నిలిచిన నేలలు, చేతులకు గ్లౌజులు గానీ, తలలకు క్యాపులు గానీ లేకుండా అత్యంత మురికిగా ఉన్న కార్మికులు మిఠాయిలను తయారుచేస్తూ కనిపించారు.
ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే వేటు తప్పదు తనిఖీల సందర్భంగా వేల కేజీల కల్తీ, గడువు ముగిసిన మిఠాయిలను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేసి నేలమట్టం చేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రముఖ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టారు. పలు దుకాణాలకు తక్షణ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన పలు ప్రముఖ షాపుల లైసెన్సులను రద్దు చేశారు.
లైసెన్సుల రద్దు, తనిఖీలకు గురైన సంస్థల జాబితాలో శ్రీజ ఫుడ్స్, వాసిరెడ్డి స్వీట్స్, ప్రమోద స్వీట్స్, గోదావరి వంటిల్లు, బాలాజీ రతన్‌లాల్, రామదాస్ స్వీట్స్, స్వీట్ బాస్కెట్, స్వగృహ ఫుడ్స్, అభిరుచి ఫుడ్స్, రాజీవ్ రెడ్డి, శుభం ఫుడ్స్, మిఠాయి మియా, సుదర్శన్ రెడ్డి స్వీట్స్, హనీ ఫుడ్స్, ఆల్మండ్ హౌస్, మధుర స్వీట్స్, మెజిస్టిక్ స్వీట్స్ తదితరాలు ఉన్నాయి.
పండుగల సీజన్లో కాసుల కక్కుర్తితో నాణ్యతలేని, కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే ఎంతటి పేరున్న బ్రాండ్ అయినా ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రతా అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా స్వీట్లు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
-
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
-
UP MLC Polls: ‘‘నమ్మకం పోయింది, ఇస్లాంలోకి మారుతా’’.. కన్నీళ్లు పెట్టుకున్న యూపీ ఎస్పీ అభ్యర్థి..
-
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
-
Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!