Sunday Funday: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు వెంబడి ట్యాంక్‌బండ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం పలు కార్యక్రమాలతో సరదాగా ముస్తాబవుతోంది. సంగీతం, షాపింగ్.. అనేక ఇతర కార్యక్రమాలతో పాటు, ఆహార ప్రియులు నిరాశ చెందకుండా ఉండేలా ట్యాంక్ బండ్ రోడ్డు పొడవునా అనేక ఫుడ్ ట్రక్కులు కూడా నగర ప్రజలకు ఏర్పాటు చేశారు. నగర ప్రజలకు మళ్లీ ఆనందాన్ని చేరువయ్యేలా సన్ డే ఫన్ డే మీ ముందుకు రాచ్చేసింది.
హైదరాబాద్ లో చూడదగ్గ ప్రదేశాలలో ట్యాంక్ బండ్ ఒకటి
భాగ్యనగరం నడిబొడ్డన ఉన్న ట్యాంక్ బండ్ హైదరాబాద్ నగర ప్రజలకు అత్యంత పురాతనమైన హ్యాంగ్అవుట్ స్పాట్‌లలో ఒకటి. దాని సహజ సౌందర్యం నగరం నలుమూలల నుండి పౌరులను విశ్రాంతి తీసుకోవడానికి , సమయాన్ని గడపడానికి ఆకర్షించే ప్రదేశం. ముఖ్యంగా సాయంత్రం ప్రజలు ట్యాంక్ బండ్ పై అక్కడి అందాలను ఆస్వాదించడానికి ఆహ్లాదంగా గడిపేందుకు వెళతారు. అయితే నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోని మంత్రి కేటీఆర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ రహితంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద సండే ఫండే అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నగర ప్రజలు ఎంతో ఉత్సాహంగా గడపడానికి అక్కడ చేరుకుంటూ ఆహ్లాదమైన వాతావరణం ఆస్వాదిస్తూ ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. దీంతో సన్ డే ఫన్ డేకు మంచి ఆరదణ లభించింది. వచ్చే సన్ డే ఫన్ డే కోసం హెచ్‌ఎండీఏ ట్రాఫిక్ లేని సండేను కుటుంబాలకు ‘ఫండేస్’గా మార్చడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో సండే ఆనందించే అనుభూతిని కలిగించేందుకు సిద్దమవుతోంది.
సండే ఫండే ఈవెంట్‌ను ఆకర్షణీయంగా చేయడానికి మ్యూజికల్ ఫౌంటెన్
హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఇటీవల ప్రారంభించిన భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్ సండే ఫండే ఈవెంట్‌ను ఆకర్షణీయంగా మార్చబోతోంది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ప్రారంభించిన ఫౌంటెన్ సుమారు 90 మీటర్ల ఎత్తులో ఉంది. దీని పొడవు 180 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు కాగా.. 17.02 కోట్లతో దీనిని అభివృద్ధి చేశారు. మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్‌లో అనేక అసాధారణమైన ఫీచర్లు ఉన్నాయి, ఇందులో మూడు లేజర్ సెట్‌లు ఉన్నాయి, వీటిలో అనేక రకాల థీమ్‌లు, మిస్ట్ ఫెయిరీ ఫాగ్, మ్యూజిక్‌తో పాటు క్లౌడ్ ఎఫెక్ట్‌ను సృష్టించడం, 800 జెట్ హై-పవర్ నాజిల్‌లు డైనమిక్ విజువల్‌కు జోడించే 880 నీటి అడుగున LED లైట్లు ఉన్నాయి. ఫౌంటెన్ యొక్క నాజిల్‌లు, జెట్‌లు DMX కంట్రోలర్ ద్వారా సంగీతంతో నియంత్రించారు. ఛేజింగ్ నాజిల్ నుండి స్ప్రేల ఎత్తు 12 నుండి 45 మీటర్ల వరకు ఉంటుంది, సెంట్రల్ జెట్ 90 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. వారం రోజుల్లో 20 నిమిషాల చొప్పున మూడు షోలను హెచ్‌ఎండీఏ నిర్వహిస్తుంది. వారాంతాల్లో సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు నాలుగు షోలు ఉంటాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లో సండే ఫండే సందర్శకులను మ్యూజికల్ ఫౌంటెన్ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. 5-6 ట్యూన్లతో కూడిన మ్యూజికల్ ఫౌంటెన్ దాదాపు 15 నిమిషాల పాటు ప్లే అవుతుంది. ఆదివారం నాడు గంట గ్యాప్‌తో నాలుగుసార్లు ఆడనుంది. అనగా రాత్రి 7 గంటలకు, గంటల గ్యాప్ తరువాత 8 గంటలకు, అనంతరం 9 గంటలకు, ఆతరువాత లాస్ట్ షో 10 గంటలకు ప్లే చేసి ముగించనున్నారు. ఈ మ్యూజికల్ ఫౌంటెన్ తో ఈ ఆదివారం “సన్ డే ఫన్ డే” భాగ్యనగర ప్రజలకు కనువిందు చేయనుంది.