Hyderabad Public School: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్‌ఆర్)కి 50 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో రేపు శనివారం (జూలై 30న) ఉదయం పదిన్నర గంటలకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ వేడుకలను ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. హెచ్‌పీఎస్‌ఆర్ కమ్యూనిటీ సభ్యులు కూడా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు.
అత్యుత్తమ ప్రమాణాలతో అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ స్కూల్లో చదువుకున్నోళ్లు చాలా మంది సమాజంలో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు. డాక్టర్లు, ఎంట్రప్రెన్యూర్లు, కార్పొరేట్ లీడర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, పబ్లిక్ సర్వెంట్లు వంటి పొజిషన్లలో విజయవంతంగా స్థిరపడ్డారు. స్వర్ణోత్సవాల శుభ సందర్భంగా రెండు ముఖ్యమైన ఇనీషియేటివ్స్‌కి శ్రీకారం చుట్టబోతున్నట్లు హెచ్‌పీఎస్‌ఆర్ యాజమాన్యం సగర్వంగా ప్రకటించింది. ఇందులో 1. గోల్డెన్ జూబ్లీ వింగ్ ప్రారంభోత్సవం 2. మాథన్ స్పోర్ట్స్ అరీనాకి శంకుస్థాపన.
Telangana Young Voters: తెలంగాణలో యంగ్ తరంగ్. రికార్డు స్థాయిలో పెరగనున్న ఓటర్లు
గోల్డెన్ జూబ్లీ వింగ్ అనేది అకడమిక్ బ్లాక్. ఉపాధ్యాయుల బోధనా విధానాలను, విద్యార్థుల అభ్యసన అనుభవాలను మరింత పెంచేందుకు సకల సౌకర్యాలతో, మోడ్రన్ టెక్నాలజీకి నిలయంగా, అడ్వాన్స్‌డ్ డిజైన్లకు అనుగుణంగా ఈ భవనాన్ని నూతనంగా నిర్మించారు. మాథన్ స్పోర్ట్స్ అరీనా అనేది ఒలంపిక్ రేంజ్ స్టాండర్డ్స్‌తో నిర్మించనున్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పతకాలను అందించే భవిష్యత్ ఛాంపియన్లకు ఇక్కడ తర్ఫీదు ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా మల్టీపర్పస్ హాల్/జిమ్నాస్టిక్స్ అరీనా, వ్యూవర్స్ గ్యాలరీతో కూడిన 6 లేన్ షూటింగ్ రేంజ్, ఫెన్సింగ్ హాల్, జిమ్ ట్రైనింగ్ సెంటర్, టేబుల్ టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు నిర్మించనున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)కి ఘన చరిత్ర ఉంది. మన దేశంలోని అతి పురాతన విద్యా సంస్థల్లో ఇది కూడా ఒకటి కావటం విశేషం. హెచ్‌పీఎస్ మొదటి క్యాంపస్ బేగంపేటలో ఉంది. రామంతాపూర్‌లో ఉన్నది రెండో క్యాంపస్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శాంతను నారాయెణ్, ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రేమ్ వత్స ఇక్కడ చదువుకున్నోళ్లే.
ఎస్కాడ ఎండీ అండ్ చైర్మన్ మేఘా పటోడియా మిట్టల్, ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ హర్షా భోగ్లే, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్‌పాల్‌సింగ్‌బంగా, ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, సుప్రీంకోర్టు న్యాయవాది మేనకా గురుస్వామి, కోబ్రా బీర్ చైర్మన్ లార్డ్ కరన్ బిలిమోరియా, ప్రముఖ భారతీయ రచయిత-జాతీయ అవార్డు గ్రహీత రామేంద్రకుమార్ వంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎందరో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు కావటం చెప్పుకోదగ్గ విషయం.