NTV Telugu Site icon

Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..

Telangana Powe Cuts

Telangana Powe Cuts

Power Cuts: హైదరాబాద్ లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ బానోతు చరణ్‌సింగ్‌ తెలిపారు. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు 11 కేవీ విద్యుత్ టవర్స్, స్వరాజ్ నగర్ ఫీడర్లు, మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు 11 కేవీ గ్రేహౌండ్స్, శ్రీరామ్ నగర్ ఫీడర్లు, మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 11 కేవీ హిందూ, సీతారామయ్య టవర్స్ ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు. 11 కెవి సోమాజిగూడ మరియు శంకర్‌లాల్ నగర్ ఫీడర్ల పరిధిలోని అనేక ప్రాంతాలు మధ్యాహ్నం 3.30 నుండి 4.30 గంటల వరకు. బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ శ్రీనివాస్‌ తెలిపారు.

Read also: Fish Medicine: రాష్ట్రానికి రెండు లక్షల కొర్రమీనులు.. ఎందుకంటే..

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్ ఈ-సేవా కార్యాలయం, అక్బర్ ఫామ్ ఫీడర్స్ ఏరియా .. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ బంజారాహిల్స్ రోడ్ నెం-7 మెరిడియన్ స్కూల్, దృష్టి ఐ హాస్పిటల్ ఫీడర్స్ ఏరియా మధ్యాహ్నం 2 నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ ఉండదని ఏడీఈ తెలిపారు. 11 కెవి బంజారాహిల్స్ రోడ్ 10, రెయిన్‌బో హాస్పిటల్, కమలాపురి కలానీ ఫీడర్‌లలో మధ్యాహ్నం 3.30 వరకు, బాబు ఖాన్ ఛాంబర్స్, శ్రీనగర్ కలానీ ఫీడర్‌లలోని అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 నుండి 4.30 గంటల వరకు సరఫరా. సైఫాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ ప్రేమానంద్‌ పాయ్‌ తెలిపారు. 11కేవీ ఆనందనగర్ కాలనీ, నాసర్ స్కూల్ ఫీడర్లలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు 11కేవీ సోమాజిగూడ విజయ ఆస్పత్రి, ఐఓఈ, ఎన్టీఆర్‌మార్గ్‌ ఫీడర్లలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
Counting Process: ఓట్ల లెక్కింపు.. జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు..

Show comments