NTV Telugu Site icon

Advises Women: అమ్మాయిలూ జాగ్రత్త.. సోషల్ మీడియా ప్రొఫైల్ లాక్ చేసుకోండి లేదంటే..

Advises Women

Advises Women

Advises Women: సౌత్ బ్యూటీ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియో విషయం టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశంలోనే సంచలనంగా మారింది. రష్మిక ముఖాన్ని జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి చెందిన వీడియోగా మార్చారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురు స్టార్ సెలబ్రిటీలు స్పందించారు. ఫేక్ వీడియోలు తీస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సహా కొందరు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు. సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్‌ను లాక్ చేయడం మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అపరిచితుల నుండి స్నేహితుల అభ్యర్థనలను అంగీకరించకండి అని సూచించారు.

ప్రొఫైల్‌ను రెండు దశల్లో భద్రపరచాలని సిఫార్సు చేశారు. స్నేహితులు, అపరిచితులతో వీడియో కాల్స్ చేయవద్దు. వీడియో కాల్స్ ద్వారా అమ్మాయిలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళలు, బాలికల ఫొటోలను తారుమారు చేస్తున్నారని.. అపరిచితులతో వీడియో కాల్స్ చేయవద్దని చెప్పారు. కాలేజీకి వెళ్లే పిల్లలను టార్గెట్ చేసుకుని ఫొటోలను తారుమారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఆడపిల్లలు, మహిళలు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయడానికి సంకోచించకండి. ఎవరైనా ఇబ్బంది పెడితే మీకు అండగా సీపీ ఉన్నారని చెప్పండి అని సలహా ఇచ్చారు. మీరు చెప్పడమే ఆలస్యం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు నేరుగా తనకు ఫోన్ చేసినా 100 శాతం న్యాయం చేస్తామని సీపీ వెల్లడించారు. మహిళలు నేరుగా మా 9490616555, 8712660001 నంబర్లకు సంప్రదించాలని అన్నారు. తన బృందం వారితో ఉంటుందని సీపీ సూచించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ నియంత్రణకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని సీపీ వెల్లడించారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతున్నారు.
Ananya Panday: అనన్య పాండే కొన్న కొత్త ఇంటి ధర ఎన్ని కోట్లో తెలుసా?