NTV Telugu Site icon

Hyderabad ORR: ఔటర్ రింగురోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంపు

Hyderabad Orr Speed Limit I

Hyderabad Orr Speed Limit I

Hyderabad ORR Speed limit increased: హైదరాబాద్ వాసులకు ఔటర్ రింగు రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఔటర్‌ రింగ్ రోడ్డు అనగానే వేగంగా దూసుకెళ్ల వచ్చని, వందల కిలోమీటర్లను అతి స్వల్ప వ్యవధిలో చేరుకోవచ్చని ఆలోచించే వారు కోకోల్లలు. అందుకే నగరంలోని ట్రాఫిక్‌తో విసిగిపోయిన దూరప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఔటర్ రింగ్ రోడ్దు ఎక్కితే చాలు కాస్త దూరం ఎక్కువే అయినా క్షణాల్లో అనుకున్న చోటుకి చేరుకుంటాం అని, హద్దు మీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణం అవుతుతూ ఉంటారు. అయితే హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్‌)పై వేగాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు అధికారులు.

Neeraja Kona: నీరజా కోన-సిద్దు జొన్నలగడ్డ సినిమా కోసం ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్లు

ఇక తాజాగా హైదరాబాద్ జంట నగరాల చుటూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ చుటూ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ గంటకు 100 కి మీ ఉండగా 120కి పెంచాలని ఈ రోజు జరిగిన సమీక్షలో హెచ్ఎండీఏకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఓఆర్ఆర్ మొత్తం ఫోర్ లైన్స్ ఉండగా, రెండు లైన్లను 100 కిలోమీటర్ల స్పీడ్, మరో రెండు లైన్లను 80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి గతంలో పరిమితం చేశారు. 100 కిలోమీటర్ల గరిష్టవేగానికి 1, 2వ లైన్‌ను కేటాయించగా, 80 కిలోమీటర్ల వేగానికి 3, 4వ లైన్‌ ఉండేది. ఈ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు స్పీడ్ గన్నులు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Show comments