NTV Telugu Site icon

Hyderabad ORR: ప్రయాణికులు అలర్ట్‌.. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత..!

Orr

Orr

Hyderabad outer ring road closure: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. రోడ్డు 2, 7 ఎగ్జిట్‌ పాయింట్లు నీరు నిలిచిపోవడంతో మూసివేస్తున్నట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ప్రకటించారు. వీలైనంత త్వరగా తిరిగి తెరుస్తామని ట్విటర్ ద్వారా అరవింద్ కుమార్ ప్రకటించారు. కాగా, పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో అందమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) బురదమయంగా మారింది. భారీ వాహనాలు వెళ్లే 3-4 లేన్లలో అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటోలు వెళ్లే 1వ, 2వ లేన్లలోకి ఆ వాహనాలు రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అధిక లోడుతో వస్తున్న భారీ వాహనాలు 3, 4 లేన్లలో బిట్టీ (తారు) లేపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్డు ఎక్కడికక్కడ దెబ్బతింది.

Read also: Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

అయితే.. 158 కి.మీ పొడవున్న ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా 316 కి.మీ ఉండగా, అందులో 100 కి.మీ మినహా మిగతావన్నీ దెబ్బతిన్నాయి. కోకాపేట నుంచి గచ్చిబౌలి, కొల్లూరు నుంచి పటాన్‌చెరు, ఘట్‌కేసర్‌ నుంచి పెద్దంబర్‌పేట, కండ్లకోయ నుంచి పటాన్‌చెరు వరకు గుంతలమయమయ్యాయి. రోజుకు 1.30 లక్షల వాహనాలు ఓఆర్‌ఆర్‌పై తిరుగుతున్నాయి. కొన్ని భారీ లోడ్ వాహనాలు ORR ఎక్కితే మరికొన్ని ఎక్కవు. దీనికి కారణం టోల్ ఫీజుతో పాటు ఇంధనం ధర కూడా పెరుగుతుండడమే! విజయవాడ, ముంబై, నాగ్‌పూర్‌, బెంగళూరు రూట్లలో ఓఆర్‌ఆర్‌ ఎక్కకుండా వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు. రాత్రి 10 గంటల తర్వాత నగరం లోపల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇది టోల్ ఛార్జీతో పాటు ఇంధన భారాన్ని నివారిస్తుంది. అయితే వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ కావడంతో భారీ వాహనాలు ఓఆర్‌ఆర్‌పైకి వెళ్తున్నాయి. వారి తాకిడి పెరిగింది.


Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం