నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు. క్రమంగా ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్‌నుమా నంచి లింగంపల్లికి 3 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు 3, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి 2, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు 2 ఎంఎంటీఎస్ రైళ్లు… ఇలా 10 ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
