NTV Telugu Site icon

అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు

కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా షెడ్లకే పరిమితమైన లోకల్‌ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2020 మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్‌, సాధారణ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చేవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి అనుమతిచ్చింది. ఎంఎంటీఎస్‌ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన పీయూష్‌ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫలక్‌నుమా నంచి లింగంపల్లికి 3 ఎంఎంటీఎస్‌ రైళ్లు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు 3, హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి 2, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు 2 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడవనున్నాయి.