NTV Telugu Site icon

Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఎప్పటి నుంచో రైలు రన్నింగ్ వేళలను పొడిగించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ (హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్) ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్ లో భాగంగా చివరి రైలు రన్నింగ్‌ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు వివరించారు. ఈ మేరకు ఫేస్ బుక్, ఎక్స్ హ్యాండిల్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: Fair Accident: రంగారెడ్డి శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం..

ఆ సమయంలో మెట్రో రైళ్లకు ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ, ట్రాక్ నిర్వహణ, కోచ్‌ల నిర్వహణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. చివరి మెట్రో రైలు శుక్రవారం రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఫుల్ గా ఉంటున్నాయని కావున మెట్రో రైల్లు టైమింగ్ మార్పులు ఉంటే బాగుంటుందని ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో యాజమాన్యం స్పందించి సమయం అనుకూలంగా ఉండేందుకు మార్పులు చేర్పులు చేశారు. అయితే.. శుక్ర, సోమ వారాలు మాత్రమే ఎందుకంటే శని, ఆదివారాలు చాలా మంది ఉద్యోగులకు సెలవుదినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక సోమవారం ఉదయం సమయంలో మార్పుకు గల కారణం ఉదయం నుంచే ఉద్యోగులు ఉండటంతో మార్పులు చేస్తున్నట్లు మోట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని సూచించారు.

Hyderabad: నాగోల్ లో తాగి రోడ్డుపై హంగామా చేసిన జంట అరెస్టు..


Medha Patkar : 23 ఏళ్ల పరువు నష్టం కేసులో దోషిగా తేలిన మేధా పాట్కర్‌