ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేక కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రోస్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కొంత కాలంగా.. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో నేడు (ఆదివారం) సాంకేతిక కారణాలతో గంట ఆలస్యంగా మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. నాగోల్ టూ రాయదుర్గం రూట్ లో గంట ఆలస్యంగా మెట్రో మొదలైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 15 నిమిషాలు కాదు 30 నిమిషాలు కాదు ఏకంగా గంటసేపు మెట్రో స్టేషన్ లోనే ప్రయాణికులు వుండిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గంటసేపు వేచి వుండాల్సి వచ్చిందని మండిపడ్డారు. త్వరగా గమ్యస్థానానికి చేరుకునేందుకు మెట్రో ఎక్కాలనుకుంటే గంటసేపు వేచి దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాను రాను మెట్రోలో సాంకేతిక లోపాలు ఎక్కువతున్నాయని , అధికారులు ఇలాంటివి ముందే ఎందుకుచూసుకోరని దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నామని మండిపడుతున్నారు.
ఆదివారం బోనాలతో భాగ్యనగరం సందడిగా మారింది. అయితే నగరంలో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయాలకు త్వరగా చేరుకునేందుకు మెట్రో బాట పట్టారు. కానీ సాంకేతిక లోపం కారణంగా మెట్రో ఆలస్యం కావడంతో మండిపడుతున్నారు.
గతంలో మే 24 , 2022 న హైదరాబాద్ మెట్రో సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యతో మూసారంబాగ్ స్టేషన్‌లో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మైట్రోరైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్తుండగా.. రైలు ఆగిపోయింది. ఫలితంగా మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తర్వాత సమస్య పరిష్కారం కావడంతో మళ్లీ మెట్రో సేవలను పునరుద్ధించారు. మైట్రో రైలు ఆగిన ప్రభావంతో మెట్రో రైళ్లలో రద్దీ కనిపించింది. అదే నెలలో.. మే 26.. సాంకేతిక సమస్య తలెత్తి నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ట్రాక్‌పై మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ కారిడార్‌లో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలోనూ మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడం, మెట్రో స్టేషన్లలో భారీగా ప్రయాణికులు చేరడంతో ఆయా స్టేషన్లు రద్దీగా మారాయి.
Cartoonist: సీనియర్ కార్టూనిస్ట్ ‘పాప’ కన్నుమూత