Site icon NTV Telugu

నేటి నుంచి మెట్రో సర్వీసుల్లో మార్పులు

తెలంగాణలో కేసులు త‌గ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసింది ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు రీషెడ్యూల్ సమయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం నిబంధనలు పాటించాలని మెట్రో అధికారులు కోరారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.

Exit mobile version