Site icon NTV Telugu

Agnipath protest: అగ్నిపథ్‌ ఆందోళన ఎఫెక్ట్‌.. నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రో..

Hyderabad Metro

Hyderabad Metro

అగ్నిపథ్‌ ఆందోళనలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చేశాయి.. రైళ్లను తగలబెట్టడం, రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించడంతో.. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు పరుగులు పెట్టారు.. అయితే, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది రైల్వేశాఖ..

Read Also: Secunderabad: ఆందోళనలకు ముందుగానే ప్లాన్ చేశారా?

మరోవైపు, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైల్వే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.. ఇక, ఎంఎంటీఎస్‌ సర్వీసులనుకూడా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో విధ్వంసంతో అప్రమత్తమైన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు.. మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్రో రైళ్లు రద్దు చేశామని.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మెట్రో సర్వీసులు ప్రారంభం కావని స్పష్టం చేశారు.. ప్రయాణికులు ఎవరూ మెట్రో స్టేషన్లకు రావొద్దని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మెట్రో అధికారులు.

Exit mobile version