Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ ఉత్సాహం సంతరించుకుంది. నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కెపిహెచ్బి కాలనీలో ఎకరా భూమి ధర రూ.70 కోట్లు తాకడం, అలాగే హౌసింగ్ బోర్డుకు చెందిన 7.8 ఎకరాలు రూ.547 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా పుంజుకుంటోందో చూపిస్తోంది. ఈ క్రమంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్న మూడు టవర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. మొత్తం రూ.70.11 కోట్లను ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వం ఆర్జించింది. నగర శివార్లలోని పోచారం టౌన్షిప్లో 194 ఫ్లాట్లు ఉన్న రెండు టవర్లు, గాజులరామారం ప్రాంతంలోని 112 ఫ్లాట్లు ఉన్న మరో టవర్‌ను లాటరీ విధానంలో కేటాయించారు.
Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?
పోచారంలోని 72 ఫ్లాట్లతో ఉన్న టవర్‌ను ఎన్టిపిసీ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు రూ.13.78 కోట్లకు కేటాయించగా, 122 ఫ్లాట్లతో ఉన్న మరో టవర్‌ను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టు వారికి రూ.30 కోట్లకు కేటాయించారు. గాజులరామారం ప్రాంతంలోని 112 ఫ్లాట్లతో ఉన్న టవర్‌ను ఎఫ్‌సిఐ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు రూ.26.33 కోట్లకు కేటాయించారు.ఈ నిర్మాణాలకు చదరపు అడుగుకు ప్రత్యేక ధరలను కూడా నిర్ణయించారు. పోచారంలోని ఫ్లాట్లకు రూ.1650, గాజులరామారంలోని వాటికి రూ.1995 రేటును ఫిక్స్ చేశారు. ఈ నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. నగర శివార్లలో ఉన్న అసంపూర్తి ప్రాజెక్టులపై ఇలాగే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్ భూముల ధరలు పెరుగుతున్న వేళ, రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ వేడెక్కుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Ganesh Chaturthi Online Permission: గణేష్ ఉత్సవాలకు ఆన్లైన్లోనే అనుమతులు.. ఇలా చేస్తే చాలు..!
