ఆగస్ట్ 15వ తేదీన 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరిక జారీ చేసింది. దేశ రాజధాని పాటు.. కీలక నగరాలను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేసారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలెర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించారు.
read also: Sixty years For Swarna Manjari :అరవై ఏళ్ళ ‘స్వర్ణమంజరి’
అయితే.. స్వాతంత్ర దినోత్సవానికి ముందు జమ్ము కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు వెల్లడించిన భద్రతా దళాలు, భారీ ఉగ్రముప్పు తప్పినట్లైందని ఊపిరి పీల్చుకున్నారు. దీని సంబందించిన పక్కా సమాచారం పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి అందింది. తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నా మని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
Cricket: అత్యుత్సాహమే పాక్ కొంపముంచుతోంది.. భారత్ గెలుపుపై పాక్ బ్యాటర్ కామెంట్స్
