Site icon NTV Telugu

Drug Racket: గ్రిండర్ యాప్‌లో గుట్టురట్టు.. హైదరాబాద్‌లో గే గ్యాంగ్ డ్రగ్ రాకెట్!

Drug

Drug

హోమో సెక్సువల్‌ గ్యాంగ్ అంతా ఓ చోట చేరింది !! ఓ యాప్‌ను అడ్డాగా చేసుకుని తమ కోరికలు తీర్చుకోవడమే కాకుండా.. మరో గలీజ్‌ దందాకి తెరలేపారు. యాప్‌లోనే కోడ్‌ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటూ… డ్రగ్స్‌ విక్రయాలు జరిపారు. హోమో సెక్స్‌కు అలవాటు కాస్తా… డ్రగ్‌ అడిక్షన్‌గా మారింది. నిఘా పెట్టిన పోలీసులు.. యాప్ చాటున జరుగుతున్న డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు చేశారు.

టెక్నాలజీ యుగంలో ప్రతీ పనికి ఓ యాప్‌ వచ్చేసింది. గలీజ్‌ పనులకూ.. కూడా కొన్ని యాప్‌లు అడ్డాగా మారాయి. అమ్మాయిలకు అబ్బాయిలు కావాలంటే ఓ యాప్‌… అబ్బాయిలకు అమ్మాయిలు కావాలంటే ఓ యాప్‌.. చివరకు అమ్మాయిలకు అమ్మాయిలు, అబ్బాయిలకు అబ్బాయిలు కావాలన్నా కూడా యాప్‌లు ఉన్నాయి. ఇలాంటిదే గ్రిండర్‌ యాప్‌. కేవలం అబ్బాయిల కోసం మాత్రమే !! అంటే… ఎక్స్‌క్లూజివ్‌ గా గేస్‌ కోసం పనిచేస్తున్న యాప్‌. ఇంటర్నేషనల్‌ వైడ్‌ గా రన్‌ అవుతున్న ఈ యాప్‌లో అన్ని దేశాలకు చెందిన యూజర్స్‌ ఉన్నారు.

ఇదే తరహాలో గ్రిండర్‌ యాప్‌లో చేరారు హైదరాబాద్‌ కి చెందిన కొందరు యువకులు. హోమో సెక్సువల్‌ కోసం తమకు తగ్గ మ్యాచ్‌ ఎంచుకుని.. తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో సెక్స్‌తో పాటు.. డ్రగ్స్‌ కి అలవాటు పడ్డారు. డ్రగ్స్‌ మత్తులో తమ కోరికలు తీర్చుకుంటూ రెచ్చిపోతున్నారు. హోమో సెక్స్‌తో మొదలై… క్రమక్రమంగా డ్రగ్‌ కు అడిక్ట్ ఐపోయారు. డ్రగ్స్‌ కోసం తాము వాడుతున్న గ్రిండర్‌ యాప్‌నే యూజ్‌ చేసుకున్నారు. యాప్‌లో కోడ్‌ లాంగ్వేజ్‌తో కమ్యునికేట్ చేసుకున్నారు. తమ ప్రొఫైల్‌ కింద రకరకాల సింబల్స్‌ను వాడుతూ డ్రగ్స్‌ దందా నడిపారు.

PM Modi: ఈయూ నేతలతో చర్చించిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

తమ ప్రొఫైల్‌ కింద సింబల్స్‌ పెట్టుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్‌ విక్రయాలు జరిపింది ముఠా. డ్రగ్‌ కావాలంటే ఫ్లవర్‌ బొకే పెట్టడం… డ్రగ్స్‌ వస్తున్నాయి అంటే ఫ్లైట్‌ సింబల్‌ పెట్టడం.. డ్రగ్స్‌ అందాయి అంటే పావురం సింబల్‌ పెట్టడం.. డ్రగ్స్‌ ఎక్కువ మొత్తంలో కావాలంటే రాకెట్‌ సింబల్‌ పెట్టడం.. ఇలా కమ్యునికేట్‌ చేసుకున్నారు.

డ్రగ్స్‌ విక్రయాలపై నిఘా పెట్టిన ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. ఈ ముఠా గుట్టురట్టు చేశారు. గ్రిండర్‌ యాప్‌ అడ్డాగా చేసుకుని డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న కన్జూమర్లతో పాటు.. డ్రగ్స్‌ అమ్ముతున్న పెడ్లర్లను పట్టుకున్నారు ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఓ నైజీరియన్‌ నుంచి డ్రగ్స్‌ కొంటున్న ఇద్దరు లోకల్‌ పెడ్లర్లు.. యాప్‌లో చేరిన కన్‌జూమర్లకు డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. నైజీరియన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

యాప్‌లో చేరిన మందుల రమాకాంత్‌, ముదావత్‌ ప్రసాద్‌ ఇద్దరికీ హోమో సెక్సువల్‌ అలవాటు ఉంది. ఇద్దరూ క్రమంగా డ్రగ్స్‌ కి అలవాటు పడ్డారు. డ్రగ్స్‌ తీసుకుని సెక్స్‌ లో పార్టిసిపేట్‌ చేసేవాళ్లు. గ్రిండర్‌ యాప్‌లో తమ వద్దకు వచ్చిన గే లకు కూడా డ్రగ్స్‌ అలవాటు చేశారు. ఒక్క గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను 10 వేల రూపాలయ చొప్పున అమ్మారు. ఓ వైపు తమ కోరికలు తీర్చుకుంటూనే.. మరోవైపు డ్రగ్స్‌ అమ్ముతూ సొమ్ము చేసుకున్నారు.

యాప్‌లో చేరి.. డ్రగ్ కన్‌జూమర్లుగా మారిన వినయ్‌ కుమార్‌, అతిప్‌ అబ్దుల్‌ సమీ, కొత్తపల్లి మోష, బల్లం వంశీకృష్ణ, కెతావత్‌ రాజునాయక్‌, షేక్‌ సమీర్‌, ఆదేపు సత్య సురేష్‌ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు పోలీసులు. డ్రగ్‌ పెడ్లర్లు రమాకాంత్‌, ప్రాసద్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

డ్రగ్‌ కన్‌జూమర్లుగా మారిన అతిఫ్‌ అబ్దుల్‌ మలక్‌పేట్‌లోని ఇండో యూఎస్‌ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. కరిచెర్ల వినయ్‌కుమార్‌ మేల్‌ ప్రాస్టిట్యూట్‌గా పనిచేయడమే ఉపాధిగా మార్చుకున్నాడు. మిగతా యువకులంతా ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రమాకాంత్‌ 5 ఏళ్లుగా ఇందిరాపార్క్‌, సంజీవయ్య పార్క్‌, పరేడ్‌ గ్రౌండ్‌తోపాటు పాటు పలు బస్టాప్‌లలో తిరుగుతూ హోమో సెక్సువల్‌ వ్యక్తుల కోసం వెతికేవాడు. ఆ తర్వాత గ్రిండర్‌ యాప్‌లో చేరాడు. తనకు ప్రస్తుతం హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. రెండేళ్ల క్రితం ఈజీ మనీకి అలవాటుపడి డ్రగ్స్‌ దందా స్టార్ట్‌ చేశాడు. ఓసారి అరెస్ట్‌ అయి జైలు జీవితం కూడా గడిపాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే దందా నడిపాడు. ఓ డ్రగ్‌ కన్‌జూమర్‌కి కూడా హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండపై.. ట్రోల్స్‌కి కారణం ఇదా ?

Exit mobile version