ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. ఏది పట్టినా వందకు తగ్గట్లేదు.. రోజూ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు.. ఇక చికెన్ ధరలు మాత్రం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గత నెలలో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.280 నుంచి రూ.320 వరకు పలికింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.140 ఉండడంతో కొనుగోళ్లకు జనాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.
కూరగాయల ధరల కంటే కోడి మాంసం రేటు తక్కువగా ఉండడంతో దాన్ని తీసుకునేందుకు దుకాణాలకు క్యూ కట్టారు. గత 20 రోజులుగా నగరంలో కిలో టమాట రేటు రూ.150 వరకు పలుకుతోంది.. అంటే టమోటా ధర కన్నా చికెన్ తక్కువ ఉండటం విశేషం.. అదే విధంగా బెండకాయ, క్యారట్, దొండకాయ కూడా రూ.50కి కిలో ఉంది. ఈ తరుణంలో రూ.500 పట్టుకుని మార్కెట్లకు వెళ్లినా సగం సంచి నిండా కూరగాయలు రాని పరిస్థితి నెలకొంది. అయితే ఓ వైపు కూరగాయల ధరలు మోతమోగుతున్న నేపథ్యంలో తాజాగా చికెన్ రేట్లు అందరికి అందుబాటులోకి వచ్చాయి..
ప్రజలు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో నచ్చిన కూరగాయలను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడంలేదు. టమాట రేట్లు ఎప్పుడు తగ్గుతాయోనని ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త పంట చేతికి వస్తే కానీ.. రేట్లు అదుపులోకి రావని, అప్పటివరకు ధరలు ఇలాగే ఉంటాయని రైతు బజార్ వ్యాపారులు అంటున్నారు.. ఇకపోతే టమోటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టమోటాలను దొంగతనం కూడా జరుగుతున్నాయి.. మరి కొంతమంది మాత్రం టమోటాలను అమ్మి కోటీశ్వరులు అయ్యారు..