NTV Telugu Site icon

Hyderabad Gold Idli: హైదరాబాద్‌లో గోల్డ్ ఇడ్లీ..! ఇప్పుడిదే ట్రెండింగ్..

Hyderabad Gold Idliy

Hyderabad Gold Idliy

Hyderabad Gold Idli: హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్ వంటి ఎన్నో ప్రత్యేక వంటకాలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రముఖ వంటకాల్లో మరో కొత్త రకం వంటకం చేరింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ వంటకం ఇప్పుడు నగరమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏమిటి? సాధారణంగా ఒక ప్లేట్ ఇడ్లీ ధర ఎంత? పెద్దగా ఉంటే రూ.30-50 ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో కనీసం రూ.500. అయితే ఈ బంగారు ఇడ్లీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర 1200 రూపాయలు. అంత ప్రత్యేకత ఏమిటి? బంగారంతో చేసిందా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. అది బంగారు ఇడ్లీ. 24 క్యారెట్ల బంగారు ఇడ్లీ అన్నమాట. ఈ బంగారు పూత పూసిన ఇడ్లీ గులాబీ రేకుల చాలా రంగురంగుల గార్నిష్‌తో వడ్డిస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని రుచి చూడాలంటే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కృష్ణ ఇడ్లీ, దోస కేఫ్‌లకు వెళ్లాల్సిందే.

Read also: Mega Star: బ్రో కన్నా ముందే భోళా శంకర్ వస్తున్నాడు…

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కృష్ణ ఇడ్లీ కేఫ్‌లో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఇడ్లీలను విక్రయిస్తున్నారు. రెండు నోరూరించే వేడి వేడి ఇడ్లీలు 24 క్యారెట్ల బంగారు కాగితంతో (తినదగినవి) వడ్డిస్తారు. ఇడ్లీతో పాటు సాంబార్ మరియు 2 రకాల చట్నీలు వడ్డిస్తారు. ఒక ప్లేట్ గోల్డ్ ఇడ్లీ ధర రూ. 1200గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ బంగారు ఇడ్లీ నగరంలో ట్రెండింగ్‌లో ఉంది. ధరతో సంబంధం లేకుండా ఈ బంగారు ఇడ్లీని రుచి చూసేందుకు చాలా మంది భోజన ప్రియులు కృష్ణా కేఫ్‌కు క్యూ కడుతున్నారు. ఇడ్లీ రుచి చూసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రయోగంపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Read also: Priya Prakash: బికినీలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న వింక్ బ్యూటీ..

భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. ఎట్టకేలకు వంటగదికి చేరిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదో కొత్త ప్రయోగమని.. సరైన మార్కెటింగ్ ఉంటే దేశ వ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులకు ఈ ట్రెండీ డిష్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో, దమ్ బిర్యానీతో పాటు, క్రిస్పీ దోశలు, స్పైసీ మిర్చిబజ్జీలు, గులాబ్ జామూన్ మరియు ఖుర్బానికా మీఠా వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బంగారు ఇడ్లీ కూడా అందుబాటులోకి రావడంతో భోజన ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల స్వీట్లను వెండి పూతతో విక్రయిస్తున్నారు. అరబ్ దేశాల్లో కొన్ని రకాల వంటకాలు బంగారు పూతతో ఉంటాయి. హైదరాబాద్‌లో తొలిసారిగా ఇడ్లీలకు బంగారు పూత వేసి భోజన ప్రియులకు విక్రయిస్తున్నారు.


Priya Prakash: బికినీలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న వింక్ బ్యూటీ..