NTV Telugu Site icon

Hyderabad Food : ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్.. కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్

Biryani

Biryani

Hyderabad Food : బిర్యానీ అంటే హైదరాబాద్‌… హైదరాబాద్‌ అంటే బిర్యానీ అని చెప్పడం అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారు దాదాపు లేరనే చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. అయితే.. ఈ క్రమంలోనే.. విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడి ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో ఫుడ్‌ క్వాలిటీ పరంగా అనేక స్టార్ రేటింగ్స్‌ను హైదరాబాద్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీ కోసం దేశంలోని ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చినవారే కాదు, విదేశీయులు కూడా ఇష్టంగా తింటూ కొనియాడుతుంటారు. అంతే కాదు, ఇక్కడి బిర్యానీ నిత్యం వేలాది పార్శిల్స్ రూపంలో ఇతర దేశాలకు వెళ్లడం సాధారణం. కానీ ఇప్పుడు పరిస్థితి ఆహార భద్రతపరంగా ఆందోళనకరంగా మారింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినడం ప్రమాదకరమైపోయినట్లు తెలుస్తోంది.

Bandi Sanjay : విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?

తాజాగా జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో చీకటి నిజాలు వెలుగుచూశాయి. అక్కడ కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా చేసిన సర్వే మరింత సంచలనం రేపింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానానికి పడిపోయింది. నగరంలోని 62 శాతం హోటళ్లు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని సర్వే పేర్కొంది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం నిలిచింది. బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అయితే.. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో.. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.

Meenakshi: సుశాంత్ తో పెళ్లి.. ఓపెనయిపోయిన మీనాక్షి

Show comments