Site icon NTV Telugu

Hyderabad Flight landed in Karachi: పాక్‌ లో ల్యాండ్‌ అయిన హైదరాబాద్‌ విమానం.. ప్రతి సారి ఎందుకిలా?

Hyderabad Flight Landed In Karachi

Hyderabad Flight Landed In Karachi

ఈ మధ్యాకాలంలో కరాచీలో ల్యాండ్? హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానాలకు సాంకేతిక లోపం? పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లోనే సమస్యలు? ముందుగానే సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించినా కరాచీ లోనే ల్యాండింగ్ ఎందుకు? అసలు సమస్య ఏమిటి? ఏం జరుగుతోంది?

హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన విమానాలు పాక్‌ లో ల్యాండ్‌ అవడం పై సర్వత్రా కలకలం రేపుతోంది. ప్రయాణికులతో బయలుదేరిన పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు.. ఇటీవల తరచుగా అత్యవసరంగా ల్యాండ్​ అవుతుండటం ప్రయాణికుల్లో అలజడి సృష్టిస్తోంది. అయితే.. అధికారులు మాత్రం వివిధ సాంకేతిక సమస్యలు కారణంగా ల్యాండ్​ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ ఘటనలపై జులైలోనే డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ విచారణకు ఆదేశించారు కూడా. అయినా మళ్లీ హడావుడిగా నిన్న 12 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం బయలుదేరింది. నిన్న మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. కొద్దిసేపటికి మళ్లీ అది 12 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి.

2022 జులై 5 ఫ్యూయల్​ ఇండికేటర్​ సమస్యః

భారత ఎయిర్​లైన్స్‌ కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్​ అవడం గమనార్హం. దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్‌ లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. దానికి కారణం ఫ్యూయల్​ ఇండికేటర్​ సరిగా పనిచేయలేదని అధికారులు తెలిపారు. కాగా.. ఆ ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్​ను భారత్​ నుంచి పంపారు. అంతవరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు

2022 జులై 15న హైడ్రాలిక్​ సమస్యః

షార్జా నుంచి కొచ్చికి బయలుదేరిన జీ9-426 విమానంలో హైడ్రాలిక్​ సమస్య తలెత్తి.. మొదలైన కిద్దిసేపటికే రన్​వేపైన పైలట్లు నిలిపివేశారు. జులై 15న అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్​కు బయలుదేరిన ఎయిర్​లైన్స్​ విమానం పలు కారణాలు వల్ల కోల్​కతా విమానాశ్రయానికి మళ్లించారు అధికారులు. అదే రోజు, శ్రీలంక ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానాన్ని చెన్నై ఎయిర్​పోర్ట్​లో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. తాజాగా ఆదివారం.. షార్జా నుంచి హైదరాబాద్​ వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం పాకిస్థాన్‌ లోని కరాచీ ఎయిర్​పోర్ట్​ లో ల్యాండ్​ అయింది.

2022 జులై 17 సాంకేతిక లోపం

షార్జా నుంచి హైదరాబాద్​ వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం పాకిస్థాన్​లోని కరాచీ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్​లైన్స్​ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్​ రప్పించేందుకు భారత్​ నుంచి పంపిన మరో విమానం కరాచీ చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విమానంలో మొత్తం 125 మందిని సురక్షితంగా హైదరాబాద్​ చేర్చనున్నట్లు పేర్కొంది.

అయితే కొందరు మాత్రం సాంకేతిక లోపాలు గత నెల నుంచి ఎందుకు అవుతున్నాయి దాని గుర్తించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. కరాచీ ప్రాంతాల్లోనే ఎందుకు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి? అసలు విమానం ఇక్కడ నుంచి బయలు దేరేప్పుడు రాని లోపాలు పాక్‌ పరిసర ప్రాంతాల్లోనే ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత మాసం నుంచి ఇలాంటివి తలెత్తుతున్నా డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ విచారణకు ఆదేశించిన ఇప్పటికి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు ఎందుకు అలా జరుగుతోంది అనే నేపథ్యంలో చర్యలు చేపట్టాలని, విచారణ జరిపించాలని ప్రయాణికులు, పలువురు కోరుతున్నారు.
Subhas Chandra Bose: మిస్టరీగానే సుభాష్ చంద్రబోస్ మరణం.. తెరపైకి కొత్త డిమాండ్‌

Exit mobile version