NTV Telugu Site icon

మరమ్మతులు: రేపు మంచినీటికి అంతరాయం

రేపు హైదరాబాద్‌ నగరంలో పైప్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్టు జలమండలి వెల్లడించింది. రేపు ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు అంతరాయం కలగనుందని తెలిపారు. తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్, మహింద్రా హిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బోడుప్పల్, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.