Child Suffering Cancer: వైరల్ అవుతున్న డాక్టర్ స్టోరీ.. ఆరేళ్ల బాలుడి గురించి ట్విట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Suffering Cancer: క్యాన్సర్ ఈ పేరు చెబితేనే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఇలాంటి మహమ్మారి ప్రాణాలు తీస్తుందని తెలిస్తే గుండె చప్పుడు తట్టుకుంటుందా.. బాబోయ్ తలచుకుంటేనే చెమటలు పట్టాయి. అయితే నాలుగేళ్ల బాలుడు మాత్రం తనకు క్యాన్సర్ అని తెలిసినా బెదరలేదు. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు కుంగిపోతారని బాలుడు వాపోయాడు. దయచేసి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పవద్దని డాక్టర్‌ని అభ్యర్థించారు. ఈ కథ ప్రతి ఒక్కరి కంటి నుంచి కన్నీళ్లు తెప్పిస్తోంది. డాక్టర్ సుధాకర్ కుమార్ ఆ పిల్లవాడి కథను వివరిస్తూ ట్విట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
6-yr old to me: "Doctor, I have grade 4 cancer and will live only for 6 more months, don't tell my parents about this"
1. It was another busy OPD, when a young couple walked in. They had a request "Manu is waiting outside. He has cancer, but we haven't disclosed that to him+Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
— Dr Sudhir Kumar MD DM🇮🇳 (@hyderabaddoctor) January 4, 2023
కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు ఆరేళ్ల వయసున్న బాలుడితో తన దగ్గరకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ జంట బాలుడ్ని బయటే ఉంచి తనను కలిశారని.. అయితే బాబుకు క్యాన్సర్ ఉందని.. ఆ విషయాన్ని చిన్నారితో చెప్పొద్దని తనను ప్రాధేయపడ్డారని ఈ విషయాన్ని వివరించారు డాక్టర్. ఆ తర్వాత బాబును లోపలికి తీసుకురాగా.. అన్ని మెడికల్ టెస్టుల రిపోర్టులు పరిశీలించానన్నారు. ఆ తర్వాత చిన్నారికి ‘గ్లయోబ్లాస్టోమా మల్టీ ఫార్మి’ అనే ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్ నాలుగో దశలో ఉందని గుర్తించానన్నారు. అయితే.. ఆ బాలుడు కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని నాకు తెలుసు. ఈనేపథ్యంలో.. మెదడు ఎడమవైపు ఈ క్యాన్సర్ రావడంతో కుడి చేయి, కాలు పక్షవాతం వచ్చింది. మాట్లాడుతున్న సమయంలో కొద్దిసేపటి తర్వాత ఆ బాలుడు తల్లిదండ్రుల్ని బయటకు వెళ్లమని చెప్పాడు.. దీంతో వాళ్లు బయటకు వెళ్లిపోయారు. అప్పుడు ఆ కుర్రాడు డాక్టర్‌తో మాట్లాడాడు. సార్.. నేను ఈ వ్యాధి పేరును ఐపాడ్‌లో టైప్ చేసి అసలు విషయం ఏంటో తెలుసుకున్నానని నాతో చెప్పాడు. క్యాన్సర్ అని తెసుకున్నాను. ఆర్నెల్ల కంటే ఎక్కువ కాలం బతకనని తెలుసని నాతో చెప్పాడు.
Read also: MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నేడు విచారణ
ఈ విషయం మమ్మీడాడీలకు చెప్పద్దు వారు తట్టుకోలేరు ప్లీజ్ డాక్టర్ మీరు కూడా చెప్పొద్దు అని బాలుడు వేడుకున్నాడు అని వివరించారు. ఆ బాలుడి మాటలు విని ఆశ్చర్యం కలిగింది. నేను చూసుకుంటానని చెప్పా ఆ తర్వాత విషయం బాబు తల్లిదండ్రులకు వివరించా…బాలుడితో ఏమీ తెలియనట్లే ఉండాలని కోరా అప్పుడే చివరి రోజుల్లో అయినా బాబుని ఆనందంగా ఉండేలా చూస్తారు. 9 నెలలు గడిచాక ఇటీవల మళ్లీ ఆ బాలుడు పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు. నేను వారిని గుర్తు పట్టి బాలుడి ఆరోగ్యం గురించి వాకబు చేయగా.. నెల క్రితమే తమను విడిచి వెళ్లిపోయాడని చెబుతూ కన్నీరుపెట్టుకున్నారు. అయితే.. ఈ 8 నెలలు ఇద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టి పిల్లవాడితో గడిపామని ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అంటూ డాక్టర్ జరిగినదంతా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ చిన్నారి పోస్ట్ చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.
Aircraft Crash: ఆలయ శిఖరాన్ని ఢీకొట్టి కూలిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!