హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్న ఆమె.. రేపు రిలీవ్ కానున్నారు.. ఏడాది పాటు ఆమె అక్కడే చదువుకోనున్నారు.. గత ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తొమ్మిది నెలలుగా మేడ్చల్ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.. దీంతో.. హైదరాబాద్‌తో పాటు, మేడ్చల్ జిల్లాకు కూడా కొత్త కలెక్టర్లను నియమించనుంది సర్కార్.
ఉన్నత చదవుల కోసం అమెరికాకు హైదరాబాద్ కలెక్టర్..! రేపే రిలీవ్..

Swetha Mahanthi