Insect Found in Biryani at Hyderabad’s Mushirabad Restaurant : బిర్యానీలో బొద్దింక.. షాకైన బిర్యానీ లవర్.. ఎక్కడంటే…
- హైదరాబాద్ లోని అరేబియన్ మండీ హోటల్ లో
- బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లు
- బిర్యానీలో బొద్దింక ను చూసి అవాక్కయిన కస్టమర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టముంటుంది. అదే హైదరాబాదీ బిర్యానీ గురించి ఐతే.. అసలు చెప్పాల్సిన పనే లేదు. బిర్యానీ కోసం ఎక్కడినుంచో హైదరాబాద్ కు వచ్చి తింటుంటారు. దీన్నే కొందరు హోటల్ నిర్వాహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత మరిచిపోతున్నారు. కొన్ని సార్లు బిర్యానిలో కప్పలు,పాములు, తేళ్లు, బళ్లులు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతున్న కొందరు హోటల్ నిర్వాహాకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పలు హోటల్లు, రెస్టారెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి కొన్ని హోటల్లు, రెస్టారెంట్లో తీరు మాత్రం మారడం లేదు. ఫుడ్ తినేందుకు వెళ్లిన కస్టమర్స్ కు వింత పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా… ఓ వ్యక్తికి బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నాడు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ముషీరాబాద్లోని అరేబియన్ మండి రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది.. కొంతమంది స్నేహితులు.. ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వెయిటర్ తెచ్చి ఇవ్వగానే.. తినడం ప్రారంభించారు.. ఇంతలోనే బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది.. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. ఇదేంటి అని రెస్టారెంట్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. పోలీసులను పిలుపించి తమనే బయటకి వెళ్లమంటున్నారని కస్టమర్లు మండిపడ్డారు.
దీంతో కస్టమర్లు రెస్టారెంట్ ముందు ఆందోళన చేయగా.. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పి పంపించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!