Site icon NTV Telugu

Insect Found in Biryani at Hyderabad’s Mushirabad Restaurant : బిర్యానీలో బొద్దింక.. షాకైన బిర్యానీ లవర్.. ఎక్కడంటే…

Sam (2)

Sam (2)

చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టముంటుంది. అదే హైదరాబాదీ బిర్యానీ గురించి ఐతే.. అసలు చెప్పాల్సిన పనే లేదు. బిర్యానీ కోసం ఎక్కడినుంచో హైదరాబాద్ కు వచ్చి తింటుంటారు. దీన్నే కొందరు హోటల్ నిర్వాహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత మరిచిపోతున్నారు. కొన్ని సార్లు బిర్యానిలో కప్పలు,పాములు, తేళ్లు, బళ్లులు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతున్న కొందరు హోటల్ నిర్వాహాకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పలు హోటల్లు, రెస్టారెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి కొన్ని హోటల్లు, రెస్టారెంట్లో తీరు మాత్రం మారడం లేదు. ఫుడ్ తినేందుకు వెళ్లిన కస్టమర్స్ కు వింత పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా… ఓ వ్యక్తికి బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నాడు.

ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది.. కొంతమంది స్నేహితులు.. ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వెయిటర్ తెచ్చి ఇవ్వగానే.. తినడం ప్రారంభించారు.. ఇంతలోనే బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది.. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. ఇదేంటి అని రెస్టారెంట్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. పోలీసులను పిలుపించి తమనే బయటకి వెళ్లమంటున్నారని కస్టమర్లు మండిపడ్డారు.

దీంతో కస్టమర్లు రెస్టారెంట్ ముందు ఆందోళన చేయగా.. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పి పంపించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version