NTV Telugu Site icon

హైదరాబాద్‌లో హెచ్‌-1బీ వీసా స్కాం..! అమెరికాలో వెలుగులోకి..

visa

హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ జ‌రిగింది.. ఇది.. అమెరికాలో వెలుగుచూసింది.. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి పాల్పడింది టెక్ కంపెనీ.. దీనిపై టెక్సస్‌లోని హూస్టన్ కోర్టులో నేరాన్నిఅంగీక‌రించారు క్లౌడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు.. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు సృష్టించిన ఆ సంస్థ‌… కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేసింది… అయితే, అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికే ప్ర‌య‌త్నం చేసింది… అడిగిన కంపెనీకి హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులను స‌ర‌ఫ‌రా చేస్తూ పోయింది… కాగా, సాధారణంగా హెచ్1బీ ప్రాసెస్ ద్వారా ఉద్యోగాలు పొందడానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.. అయితే, వీసాతో రెడీగా ఉన్న ఉద్యోగులను కలిగి ఉండడం క్లౌడ్‌జెన్‌కు మార్కెట్లో అడ్వాంటేజ్‌గా మారింది.. ఇక‌, ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంతో డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు తేలింది.. ఉద్యోగుల నుంచి కమిషన్ల రూపంలో 2013 నుంచి 2020 మధ్య 5 లక్షల డాలర్ల మేర వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.. రికార్డుల ప్రకారం క్లౌడ్‌జెన్ సంస్థకు ప్రెసిడెంట్‌గా శశి పల్లెంపాటి, వైస్ ప్రెసిడెంట్‌గా జోమోన్ చక్కలక్కళ్ ఉన్నారు.. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం వర్జీనియాలోని మానస్సాస్, హైదరాబాద్ గచ్చిబౌలి, కెనడా, రొమేనియా దేశాల్లో కార్యాలయాలు క‌లిగి ఉంది. ఇప్పుడు హైద‌రాబాద్ కేంద్రంగా హెచ్‌1బీ వీసా స్కామ్ వెలుగుచూడ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.