Site icon NTV Telugu

HyBiz TV Awards : హైదరాబాద్‌లో తొలిసారి హై బిజ్‌ టీవీ ఫుడ్‌ అవార్డులు

Hybiz Tv

Hybiz Tv

హైదరాబాద్ , జూన్ -2022 : హాస్పిటాలిటీ రంగంలో విశేష సేవలందిస్తున్న వ్యక్తులు , ఔట్ లెట్లు , బ్రాండ్లకు అరుదైన గుర్తింపు దక్కనుంది . ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికిగానూ సముచిత గౌరవం లభించనుంది . అద్భుతమైన రుచులను ప్రజలకు అందిస్తున్న వ్యక్తులు , ఔట్ లెట్లు , బ్రాండ్లకు .. హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ అందజేయనుంది . హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలో ఇలాంటి పురస్కారాలు ప్రదానం చేయనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం . ఆహారం లేనిదే జీవి మనుగడ లేదు . తిండి లేకుంటే బతకడం సాధ్యపడదు . ఆహారానికి అంతటి ప్రాధాన్యముంది . అందుకే హై బిజ్ టీవీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది . మరే ఇతర ఛానల్ కు సాధ్యపడని రీతిలో గత 13 ఏళ్లుగా 15 వేల కు పైగా ఫుడ్ వీడియోస్ ను రూపొందించింది . స్ట్రీట్ ఫుడ్ మొదలుకుని ఫైవ్ స్టార్ హోటళ్ల దాకా హై బిజ్ టీవీ ఎక్స్ ఫ్లోర్ చేయని ఫుడ్ లేదంటే అతిశయోక్తి కాదు . హైదరాబాద్ లోని హోటళ్లు , రెస్టారెంట్లలో దొరికే అన్ని రకాల రెసిపీస్ ను జనాలకు పరిచయం చేసింది . ఈ అనుభవంతో ఇప్పుడు ఫుడ్ అవార్డ్స్ తో హై బిజ్ టీవీ సగర్వంగా మీ ముందుకొస్తోంది . పురస్కారాల్లో భాగంగా 50 కి పైగా కేటగిరీల్లో ఫుడ్ అవార్డ్స్ ను హై బిజ్ టీవీ అందజేయనుంది . హాస్పిటాలిటీ రంగంలో అమూల్యమైన సేవలను అందించిన పలువురు లెజెండ్స్ ను సత్కరించనుంది . హైదరాబాద్ లో ఆగస్టు 27 న ఈ కార్యక్రమం జరుగనుంది . కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు . హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ కు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు . హైదరాబాద్ లోని హోటల్ గోల్కొండలో ఈ కార్యక్రమం జరిగింది . పి . చంద్రశేఖర్ రెడ్డి ( వైస్ ప్రెసిడెంట్ , సేల్స్ & మార్కెటింగ్ , జీఈఎఫ్ ఇండియా – ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ) , హర్ష చిత్తూరి ( బిజినెస్ హెడ్ రిటైల్ , శ్రీనివాసా ఫార్మ్స్ ) , హై బిజ్ టీవీ & తెలుగు నా ఎండీ మాడిశెట్టి రాజ్ గోపాల్ , హై బిజ్ టీవీ & తెలుగు నా సీఈవో డాక్టర్ జె . సంధ్యారాణి ఇందులో పాల్గొన్నారు . హాస్పిటాలిటీ రంగంలోని వ్యక్తులు , బ్రాండ్లు , ఔట్ లెట్లకు హై బీజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ మరింత గుర్తింపును ఇవ్వనున్నాయి . వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొనేందుకు దోహదపడనున్నాయి.

 

 

Exit mobile version