NTV Telugu Site icon

Wife and Husband: నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

Saroornagar

Saroornagar

Wife and Husband: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ మాత్రమే కాదు సహనంలో సీతగా కూడా భార్యకు చాలా మంచి స్థానం ఉంది. అటువంటి భార్య..భర్తల వైవాహిక జీవితంలో అన్నీ అడ్డంకులే. ఎవరు ఏమనుకున్నా అలగడం, లేక ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా చంపేయడం ఇటువంటివి మనం రోజూ చూస్తున్నాము. భార్య భర్తల జీవితాల్లో సర్దకు పోవాలి అనే మాట కరువైంది. సర్దుకుని సంసారం చేసేందుకు ఇద్దరి మనోభావాలు అడ్డుగా వస్తున్నాయి. నువ్వెంత అంటే నేనింతే అనే మాటలు, మాటల తూటాల్లా సంసారంలో పేలుతున్నాయి.

ఒకొరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి. చీటికి మాటికి అలగడం, మాట్లాడుకోకుండా జీవితాలను చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి అక్రమ సంబంధాలు, కేసులు, ఆత్మహత్యలు, దాడులు చేసుకునే రోజులు వస్తున్నాయి. అంతేకాదు భర్త తిట్టిన కొట్టిన భార్య సర్దుకుని సంసారం చేస్తే అది ఎనలేని వీడని బంధం అవుతుంది. ఇది నేరమే అయినా సంసారం సాఫీగా జరగాలంటే ప్రేమతో కొట్టిన, తిట్టినా అదే అలుసుగా తీసుకుని భర్త పై భార్య, భార్యపై భర్త అలగడం, గొడవ పడటం ఇప్పుడు ఫ్యాషన్‌ గా మారుతుంది. అయితే ఓ మహిళ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో కోపంతో భర్త విద్యుత్ స్తంబం ఎక్కిన ఘటన సైదాబాద్‌ సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది.

Read also: Arunachal Pradesh cm: అరుణాచల్‌ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ.. వరుసగా మూడోసారి ( వీడియో)

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు, తన భార్యతో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులు అన్యోన్యంగా సాగిన వీరిజీవితంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. మద్యానికి బానిసైన మోహన్, తన భార్యతో రోజూ గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య.. భర్త మోహన్ పై ఆగ్రహం వ్యక్తం చేసేది. దీంతో భర్త మోహన్ కు భార్యకు చిన్నపాటు గొడవైంది. మోహన్ మద్యానికి బానిసై రోజూ ఇంటికి తాగిరావడంతో విసుగు చెందిన భార్య అలిగి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యం మత్తులో వున్న మోహన్ బాబు.. స్థానిక కాలనీలోని శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు.

మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. దీంతో స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు మద్యం బాబు గంటన్నర పాటు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కుతాడని, భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులే చేస్తాడని స్థానికులు పోలీసులకు తెలిపాడు.
NEET-UG 2024: నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ..