తెలంగాణలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షల కారణంగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 45, 210 క్యూసెకులుగా ఉంది. శ్రీ రాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 90 టిఎంసీలు కాగా ప్రస్తుతం 85 టీఎంసీలు ఉంది. అయితే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. అయితే శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు వరద వస్తుండటంతో పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద…
