Site icon NTV Telugu

మేడారం జాత‌ర‌కు ముందే పోటెత్తిన భ‌క్తులు…

మేడారం జాత‌ర ఫిబ్ర‌వ‌రి నెల‌లో ప్రారంభం కాబోతున్న‌ది.  ఫిబ్ర‌వ‌రి 16 నుంచి జాత‌ర ప్రారంభం కాబోతున్న‌ది.  అయితే, జాత‌ర కంటే ముందే భ‌క్తులు మేడారంకు పోటెత్తుతున్నారు.  జాత‌ర‌లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి ఆంక్ష‌లు, జాత‌ర స‌మ‌యంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తార‌నే ఉద్దేశంతో ముందుగానే భ‌క్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.  ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌స్తున్నారు.  భ‌క్తుల‌తో మేడారం కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెల‌వులు కూడా ఉండ‌టంతో మేడారంకు భ‌క్తుల రాక పెరిగింది.  మూడు రోజులు మేడారం భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది.  జంప‌న్న‌వాగులో పుణ్య‌స్నానాలు ఆచ‌రించి భ‌క్తులు అమ్మ‌వార్ల‌కు పూజ‌లు నిర్వ‌హించారు. 

Read: ఈ విస్కీ చాలా కాస్ట్‌లీ…!!

Exit mobile version