హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. అఫ్రికాలోని జాంబియా, ఉగాండా దేశాల నుంచి వచ్చిన మహిళల నుంచి రూ.78 కోట్ల రూపాయల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసులకున్నారు. జోహెన్నస్ బర్గ్ నుంచి దోహామీదుగా హైదరాబాద్‌కు చేరుకున్న ఈ మహిళల నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ స్వాదీనం చేసుకున్న అధికారులు, ఆ డ్రగ్ ను ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయంపై దృష్టిసారించారు. సూట్‌కేసుల పైపుల మధ్యలో ఉంచి ఈ డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం చెన్నైలో రూ.73 కోట్ల రూపాయల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చెన్నై, హైదరాబాద్ డ్రగ్స్ లింకులపై డీఆర్ఐ విచారణ చేస్తున్నది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత…
