Site icon NTV Telugu

రాజేంద్రనగర్ లో విషాదం… హోం గార్డు ఆత్మహత్య

రాజేంద్రనగర్ గండిపేట మండలం నార్సింగీ లో విషాదం చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడుకు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు హోం గార్డు. అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులు పెట్టుకొని స్థోమత లేక ఆత్మహత్య కు చేసుకున్నట్లు సమాచారం. అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు… మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు

Exit mobile version