IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి రేవంత్ సర్కార్ మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఆమ్రపాలి ప్రస్తుతం HMDA- IT – ఎస్టేట్ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ MD గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆమెకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ డా.ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలుగింటి ఆడపడుచు అమ్రపాలి.. తెలంగాణ కేడర్ అధికారిణి. గతంలో కేంద్రంలో పనిచేసిన యువ ఐఏఎస్ లు ఎన్నికల అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చేశారు. అనంతరం హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లలో అమ్రపాలి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Read also: Hostel at Bhuvanagiri: మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి.. విద్యార్థినులు సూసైడ్ నోట్..!
ఆమ్రపాలి విశాఖపట్నంలో చదివి సత్తాచాటి 2010 యూపీఎస్సీ సివిల్స్‌లో 39వ ర్యాంకు సాధించింది. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, సిటీ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డిప్యూటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిషోర్ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న హెచ్ ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.శనివారం హెచ్ ఎండీఏ కార్యాలయానికి వచ్చి బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఫైళ్లను కూడా పరిశీలించారు.
Prabhas: సెట్స్ అలానే ఉన్నాయి… షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్